తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేడు స్వామివార్ల గ్రామోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. నూతన వధూవరులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు పొన్నవాహనం, రావణబ్రహ్మ వాహనాలపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. లంకాధిపతి రావణాసురుడు సత్యనారాయణ స్వామికి సేవలు చేస్తాడనీ.. దానికి ప్రతీకగానే రావణ వాహనంపై సత్యదేవుడు ఊరేగుతాడని పండితులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
'రావణబ్రహ్మ' వాహనంపై సత్యదేవుడు - అన్నవరం
అన్నవరం సత్యనారాయణ స్వామి గ్రామోత్సవం వైభవోపేతంగా జరిగింది. పొన్నవాహనం, రావణబ్రహ్మ వాహనాలపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
'రావణబ్రహ్మ' వాహనంపై సత్యదేవుడు