కరోనా దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం నిలిపివేశారు. దీనివల్ల ఆ గ్రామంలోకి భక్తులు ఎవర్నీ రానీయకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వాడపల్లి ప్రధాన రహదారికి అడ్డంగా భారీ గేట్లు ఏర్పాటు చేసి... ఆలయానికి వచ్చే భక్తులను వెనక్కి పంపుతున్నారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి...ఏడు శనివారాల నోము నోచుకుని భక్తులు రానున్న సమయంలో ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా స్వామి దర్శనం నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఆదివారం నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయని...అందుకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఈఓ కోరారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి నిరాకణ
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తోన్న భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆలయ ఈఓ తెలిపారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతించని అధికారులు