తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నవరాత్రుల మహోత్సవం, ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడం వల్ల ఆలయం రద్దీగా మారింది.
స్వామి- అమ్మవార్లకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. దేవాదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు స్వామి దర్శనానికి అవకాశం కల్పించారు.