తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్ లీకేజీ అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు... అగ్నిమాపక శకటాలతో నీళ్లు చిమ్ముతున్నారు. పరిసర ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు... ఘటన ఎలా జరిగిందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకుండా పోలీసులు అప్రమత్తం చేశారు. ఉప్పూడికి మూడు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరానికి తరలించారు. గంటివారిపేట, నాగిచెరువు, బంటుమిల్లి, చిలకమ్మచెరువు వాసులను పునరావాస శిబిరానికి తీసుకెళ్లారు. ఉప్పూడి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పదేపదే లీకులు.. ఎన్నాళ్లీ షాక్‌లు !
పదేపదే ఇక్కడ లీకేజీ సమస్య తలెత్తుతుందని.. ఇంకా ఎన్నాళ్లు ఇలా బాధపడాలంటూ ఉప్పూడి గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్ లీకేజీ కావటంతో అధికారులు స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉప్పూడి గ్యాస్ లీకేజీ