Unique cow calf: బడిలో చదువుకున్న 'కోడిగుడ్డంత గోధుమ గింజ' అనే పాఠం మీకు గుర్తుందా..! గుర్తుంటే సరే, లేదంటే.. ఈ కథనాన్ని చదవండి. ఆ పాఠంలో గోధుమ గింజలన్నీ మామూలు సైజులో ఉన్నప్పటికీ.. ఒక గోధుమ గింజ మాత్రం కోడిగుడ్డు సైజులో ఉండి ఆశ్చర్యపరుస్తుంది. దీనికి రివర్స్‌లో ఓ ఆవుదూడ జన్మించింది. సహజంగా ఆవుదూడ పుట్టగానే ఎంత పొడవు ఉంటుందో మనకు తెలిసిందే. కానీ.. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేవలం 12 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న బుజ్జి ఆవుదూడ జన్మించింది.
Unique cow calf: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో గుండాబత్తుల మధు అనే యువరైతు 12 ఆవులను పెంచుతున్నారు. ఆ మందలోని ఓ ఆవు.. బుజ్జి ఆవు దూడకు జన్మనిచ్చింది. ఇది 12 అంగుళాల ఎత్తు, 21 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. ఇది 'స్వర్ణ కపిల పెయ్య' రకానికి చెందినదని రైతు తెలిపారు. సాధారణ ఆవు దూడల కంటే భిన్నంగా ఉండటంతో స్థానికులు దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. చెంగుచెంగున చిందులేస్తున్న ఈ ఆవు దూడ వెంట చిన్నారులు పరుగులు తీస్తూ, పట్టుకుంటూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు.