Kakinada boat club: కాకినాడ బోట్ క్లబ్ చెరువు వద్ద విషాదం నెలకొంది. చెరువులో మునిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సరదాగా చేపలు పడుతున్న చిన్నారులు.. తృటిలో చెరువులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Kakinada boat club: బోట్ క్లబ్ చెరువులో మునిగి.. ఇద్దరు పిల్లలు మృతి! - ఏపీ వార్తలు
Kakinada boat club
19:40 February 06
సరదాగా చేపలు పడుతూ చెరువులో పడిపోయిన చిన్నారులు
నీటిలో గాలించి.. చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నాగయక్ష సూర్యకుమార్ (12), వాసంతి నోవా (10)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి
Last Updated : Feb 6, 2022, 8:07 PM IST