తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెల 15న పర్యాటక బోటు గోదావరిలో మునిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గోదావరిలో వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ పర్యాటక బోటుకు అనుమతించిన అధికారులుపై... చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు.
కచ్చులూరు బోటు ప్రమాదం... మృతులకు నివాళులు - godavari boat accident latest news today
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెలలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతిచెందిన వారికి బీసీ యువజన సంఘం బాధ్యులు నివాళులర్పించారు.
గోదావరి పర్యాటక బోటు ప్రమాదంలో చనిపోయిన వారికి ఘన నివాళి