అధికారుల ఆదేశాల మేరకు బోట్లు నిలిపేత వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిపారుదలశాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ భవాని ద్వీపం పర్యాటక బొట్లు నిలిచిపోయాయి. గోదావరి, పాపికొండల్లో బోటు మునక విషాదంతో పడవలన్నీ పూర్తిగా ఒడ్డుకు చేరాయి. ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా కృష్ణా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ముందస్తుగానే అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటక బోటులైన బోధిసిరి, భవాని, కృష్ణవేణి, అమరపాలి, ఫంటూన్, పల్నాడు, ధరణి, కనకదుర్గ వంటి బొట్లు నిలిపివేశామని యాజమానులు తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ బోటు ప్రయాణం రద్దు చేస్తున్నట్లు భవాని ఐలాండ్ బోటింగ్ మేనేజర్ మల్లేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి: