ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరం ఆసుపత్రికి ముగ్గురు కరోనా బాధితులు - రాజమహేంద్రవరం ఆసుపత్రికి కరోనా బాధితులు

తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేటలో.. ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. వీరు కూరగాయలను తీసుకుని చెన్నైలోని కోయంబేడు మార్కెట్​కు వెళ్లి... తిరిగి ఈ నెల 10న కొత్తపేటకు రాగా.. అధికారులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ సోకినట్టుగా ఫలితం రాగా.. రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.

three people affected with corona are sent to rajamahendravarm hospital
రాజమహేంద్రవరం ఆసుపత్రికి ముగ్గురు కరోనా బాధితుల తరలింపు

By

Published : May 12, 2020, 5:50 PM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని ముగ్గురు కరోనా బాధితులను.. రాజమహేంద్రవరం ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఏనుగుమహల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, బోడిపాలెం వంతెన ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. నెల క్రితం కూరగాయలను తీసుకుని చెన్నైలోని కోయంబేడు మార్కెట్​కు వెళ్లారు.

లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండి... తిరిగి ఈ నెల 10న కొత్తపేట శివారు బోడిపాలెం చేరుకున్నారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ తెలిపారు. ఈ ముగ్గురినీ రాజమహేంద్రవరం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details