అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు - దొంగలు
వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 7 తులాల బంగారం, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని సూర్యాపేట, కాకినాడలోని చరవాణుల దుకాణం, విశాఖ జిల్లా రావికమతం నగల దుకాణాల్లో దొంగతనాలు చేసినట్లు సీసీఎస్ ఇంఛార్జ్ డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. వీరి నుంచి 10కేజీల వెండి, 7తులాల బంగారం, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా కాకినాడ పరిసర ప్రాంతవాసులుగా గుర్తించారు. ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని... త్వరలోనే వారిని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.