ఎన్నికల సమయంలో తెదేపా నేత చినరాజప్ప ఇచ్చిన అఫిడవిట్ తప్పులతడకగా ఉందని పెద్దాపురం వైకాపా ఇంఛార్జ్ తోట వాణి ఆరోపించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై దాడి ఘటనలో చినరాజప్పపై క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ... నామపత్రంలో దానిని పేర్కొనలేదని చెప్పారు. విజయవాడ కోర్టులో చినరాజప్పపై నాన్ బెయిలబుల్ కేసు ఉన్నట్లు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో చినరాజప్ప అవినీతి వ్యవహారాలు చాలా ఉన్నాయని తోట వాణి ఆరోపించారు. ఒక్కొక్కటిగా వెలికి తీసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చినరాజప్ప అక్రమాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.
చినరాజప్ప అక్రమాలపై కలెక్టర్కు నివేదిక: తోట వాణి - chinarajappa
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చిన చినరాజప్పపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పెద్దాపురం వైకాపా ఇంఛార్జ్ తోట వాణి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కాకినాడలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
పెద్దాపురం వైకాపా ఇంఛార్జ్ తోట వాణి