ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లలమామిడాడలో మరో 30 కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కరోనా వ్యాపిస్తోంది. ఇటీవల కరోనా పాజిటివ్ లక్షణాలతో మరణించిన వ్యక్తి వల్ల... కేసుల సంఖ్య పెరుగుతోంది. 28వతేదీన 82 కేసులు నమోదవగా... ఈరోజు మరో 30 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

thirty corona positive cases registerd  in mamidaada
గొల్లల మామిడాడలో మరో 30 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : May 29, 2020, 8:11 PM IST

కరోనా కేసులు పెరుగుతుండడంతో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ నిర్మానుష్యంగా మారింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో .. ఆ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా జాడలతో గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చారు. కొందరు ఆసుపత్రుల్లో.. మరికొందరు క్వారంటైన్‌ కేంద్రంలో.. ఇంకొందరు స్వీయ నిర్బంధంలో బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు.

తొలి పాజిటివ్‌ కేసు కాకినాడ జీజీహెచ్‌లో ఈనెల 21న చేరి.. అదే రోజు మరణించడంతో అలజడి మొదలైంది. ఆ వ్యక్తి ద్వారా పలువురికి వైరస్‌ వ్యాప్తిచెందడం.. గ్రామంతో పాటు చుట్టుపక్కల అయిదు మండలాలో ఆందోళన నెలకొంది. పాజిటివ్‌ మృతుడితో సంబంధాలున్న 82మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పెదపూడి మండలంలోని పెద్దాడ, రాజుపాలెంలో ఒక్కో పాజిటివ్‌ కేసు, బిక్కవోలు మండలంలో 17, రామచంద్రపురంలో 6 కేసులు, మండపేట, అనపర్తి మండలాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా.. మిగిలిన 54 కేసులు జి.మామిడాడలోనే వెలుగు చూశాయి. దానికితోడు ఇవాళ మరో 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంవత్సరం బాలుడితో పాటు 70 ఏళ్ల వృద్ధురాలిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి.

ఇదీచూడండి.'ఉదారుడు.. ఉద్దీప్ సిన్హా'

ABOUT THE AUTHOR

...view details