ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిలిన జ్ఞాపకం.. స్పందించిన మానవత్వం - రాజోలు వార్తలు

దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని.... జనసైనికులు అతని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తూర్పు గోదావరి జిల్లా తాటిపాక గ్రామానికి చెందిన వ్యక్తిని.. కుటుంబీకులకు అప్పగించారు.

The man who left home about thirty years ago has returned at tatipaka
స్పందించిన మానవత్వం

By

Published : Sep 15, 2020, 10:35 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలంలోని తాటిపాకకు చెందిన కాళిశెట్టి శ్రీహరిరావు... మతిస్థిమితం లేక 30 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న శ్రీహరిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి జనసైనికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు.

వారికి తన ఊరు తాటిపాక అని తెలపగా.. అతని ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ వివరాలను తాటిపాకకు చెందిన చిరుపవన్‌ సేవా సమితి సభ్యులు ఆరా తీసి శ్రీహరిరావు కుటుంబ సభ్యులను గుర్తించారు. సోమవారం ఎచ్చెర్ల జనసైనికులు శ్రీహరిరావును రాజోలుకు తీసుకువచ్చి అతడి చెల్లెలు అనంతలక్ష్మికి అప్పగించారు. ఆమె జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details