తూర్పుగోదావరి జిల్లా తుని గ్రామీణ సీడీపీవోను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ.. తుని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. పై అధికారిణి తమను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఆమెపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిచే ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించనా వారు వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కులంపేరుతో దూషించారంటూ.. అంగన్వాడీ వర్కర్ల ఆందోళన - caste
పై అధికారిణి తమను కులం పేరుతో దూషించారంటూ.. తూర్పుగోదావరి జిల్లా తుని గ్రామీణ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టారు. తక్షణమే సీడీపీవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ వర్కర్ల ఆందోళన