ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా ప్రాంతంలో మద్యం కొనుగోలు చేస్తే.. తప్పేంటి?

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో యువకులు నిరసనకు దిగారు. తమ ప్రాంతంలో మద్యం సీసాలు కొనుగోలు చేసుకుని పోతుంటే తమని అదుపులోకి తీసుకోవడమేంటని ప్రశ్నించారు.

నిరసన
నిరసన

By

Published : Oct 29, 2021, 8:19 PM IST

తమ ప్రాంతంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి వెళుతుండగా పట్టుకోవడానికి అధికారం ఎక్కడిదంటూ పోలీసులను యువకులు ప్రశ్నించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్ల నీలపల్లి జంక్షన్ వద్ద ఉన్న మద్య నియంత్రణ తనిఖీ కార్యాలయం వద్ద జరిగింది. 2 రోజుల క్రితం యానంలో దరియాలతిప్ప గ్రామానికి చెందిన కొందరు యువకులు 5 మద్యం సీసాలు కొనుగోలు చేశారు. ఆ మద్యం సీసాలతో ద్విచక్రవాహనంపై వారి స్వగ్రామానికి వెళుతుండగా నీలపల్లి చెక్​పోస్టుకు సంబంధించిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకొని తాళ్లరేవు ఎక్సైజ్ స్టేషన్ తరలించారు.

దీనికి నిరసనగా యువకుల కుటుంబీకులు, గ్రామస్థులు.. పోలీసులపై వాగ్వాదానికి దిగారు. కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము.. యానాం స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివ గణేష్ ఇతర పోలీసులు చెక్ పోస్ట్ వద్దకు చేరుకొని చర్చించారు. అనంతరం ఆ యువకులను నేలపల్లి పోలీసుల వదిలేశారు.

ఇదీ చదవండి:CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి.. ఇంటర్నెట్‌ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details