తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. దాంతోపాటే భాష అధ్యయన సంస్థనూ ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
త్వరలో తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటు - తెలుగు, సంస్కృత అకాడమీ
తిరుపతిలో తర్వలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భాషా చైతన్య సదస్సుకు హాజరైన ఆమె.. విలేకరులతో మాట్లాడారు. తెలుగు అకాడమీ నిధులు త్వరలో రాష్ట్రానికి వస్తాయన్నారు. ఇంటర్ పుస్తకాల ముద్రణ పూర్తయిందని త్వరలో విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. డిగ్రీ, పోటీ పరీక్షలు, బీఈడీ, సాహిత్య పుస్తకాలనూ త్వరలోనే అకాడమీ ద్వారా ముద్రిస్తామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు, రిజిస్ట్రార్ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Lakshmi Parwathi: 'తెలుగును బతికించేందుకే.. సంస్కృతాన్ని అకాడమీలో కలిపారు'