తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతుల పూడి మండలం పైడిపాల గ్రామంలో ఇళ్లను కొందరు ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తలే తమ ఇళ్లను నాశనం చేశారని బాధితులు ఆరోపించారు. కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డామని వాపోయారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలు ఉన్నా.. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. వైకాపాలో చేరకుంటే తమను గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ వరుపుల రాజా బాధితులను ఓదార్చారు. ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. వైకాపా నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయిందని రాజా అన్నారు. అనంతరం బాధితులతో కలిసి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.