మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని.., దీనికి తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.
'వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది' - అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా రావులపాలెంలో నిరసన
వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని.. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు.
రావులపాలెంలో తెదేపా నేతల నిరసన