రాష్ట్ర డీజీపీతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అనపర్తి గ్రామంలో కర్రి అరుణ కుమారి ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళ ఆత్మహత్యకు ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలన్నారు.
వీధికి సిమెంట్ రోడ్డు వేయించే విషయంలో ఇచ్చిన మాట తప్పినందుకే అరుణ కుమారి ఆవేదన చెందిందని తెలిపారు. సూర్యనారాయణరెడ్డిపై చర్యలు లేకుంటే ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలోనూ ప్రజలతో పాటు వైకాపా కార్యకర్తలనూ మోసం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే అనేక మంది వైకాపా కార్యకర్తలు, ప్రజలు బహిరంగంగా బయటకు వచ్చి తమ ఆవేదన చెప్పుకుంటున్నారని లేఖలో తెలిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అసత్య హామీలు గుప్పించారన్నది తేటతెల్లమైందని లేఖలో ధ్వజమెత్తారు.
ప్రాణాలను బలి తీసుకున్నారు: లోకేశ్