ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెదేపా కార్యకర్త పంపన ఆనందరావు కుటుంబానికి ఆ పార్టీ నేతలు ఆర్థిక సహాయం చేశారు. నాయకులంతా సమకూర్చిన డబ్బును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పులుగుర్త గ్రామంలోని ఆనందరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధ పడవద్దంటూ ధైర్యం చెప్పారు. వైకాపా నాయకులు, పోలీసులు వేధింపుల వల్లే ఆనందరావు ఆత్మహత్యాయత్నం చేశాడని ఆయన ఆరోపించారు.
'పంపన ఆనందరావు కుటుంబానికి తెదేపా నేతల ఆర్థిక సాయం'
ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెదేపా కార్యకర్త పంపన ఆనందరావు కుటుంబానికి పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. వైకాపా నాయకుల వేధింపుల వల్లే అతను అఘాయిత్యం చేసుకున్నాడని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ఆనందరావు కుటుంబానికి తెదేపా నేతల ఆర్థిక సాయం
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న పిలుపుతో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆర్థిక సహాయం చేశారన్నారు. అనపర్తిలోని పార్టీ నేతలు ఇప్పటివరకు రూ. 2.16 లక్షలు అందజేశామన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని.. త్వరలో అది కూడా అందిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'పేదలు, ప్రతిపక్షాలను అణగదొక్కడమే వైకాపా ప్రధాన ఎజెండా'