తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యులు బండారు సత్యానందరావు సమావేశం నిర్వహించారు. వైకాపా పాలన అంతా రివర్స్ టెండరింగ్, రివర్స్ గేర్ పాలనలా ఉందని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనకబడి పోయిందన్నారు. పోలవరం అన్నదాతల జీవనాడి అని... భవిష్యత్తులో రాజధాని రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుందని.. అటువంటి వాటిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
'వైకాపా పాలనలో వంద రద్దులు, కూల్చివేతలు' - comments
వైకాపా ప్రభుత్వంపై కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యులు బండారు సత్యానందరావు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా రాష్ట్ర ప్రగతి ముందుకు కాకుండా వెనకబడిందన్నారు.
తెదేపా