తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని ఎర్రంశెట్టివారిపాలెంలో ఇటీవల అకాల మరణం పొందిన తెదేపా నేత సుంకర సోమేశ్వరరావుకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంతాపం తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సముదాయించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కన్నబాబు విమర్శలు చేయడం మానుకోవాలని చినరాజప్ప తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడతాయని అన్నారు. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికి ఉంటాయని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు వారంతా ఒక్కటేనంటూ.. కన్నబాబు విమర్శించడం తగదని పేర్కొన్నారు.
'ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికి ఉంటాయి' - తూర్పు గోదావరి జిల్లా సమాచారం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కన్నబాబు విమర్శలు చేయడం మానుకోవాలని తెదేపా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు వారంతా ఒక్కటేనంటూ కన్నబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు.
'ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికి ఉంటాయి'