అంతర్వేదిలో రథం దగ్ధమవడంపై తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలోని తెదేపా నిజ నిర్ధారణ బృందం ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీసింది. నెల్లూరు, పిఠాపురం తాజాగా అంతర్వేది.. ఇలా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దారుణమని చినరాజప్ప మండిపడ్డారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారని... కల్యాణోత్సవాలకు అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెదేపా నేతలు అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఘటనపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం బృందంతో పాటు అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ఆలయాన్ని సందర్శించారు.
రథం దగ్ధంపై సీబీఐ విచారణ జరిపించాలి: తెదేపా నిజ నిర్ధారణ కమిటీ - అంతర్వేది రథం వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెదేపా నిజ నిర్ధారణ కమిటీ అంతర్వేదిలో పర్యటించి..ఘటనాస్థలాన్ని పరిశీలించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు.
రథం దగ్ధంపై సీబీఐ విచారణ జరిపించాలి: తెదేపా నిజ నిర్ధారణ కమిటీ