కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన తణుకు వంశ ఇలవేల్పు సత్తెమ్మ తల్లి జాతర తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఘనంగా జరిగింది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలను తణుకు వంశీకులు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు పంబ నాదపు కళాకారులు అమ్మవారి చరిత్రను వివరించగా.. రెండోరోజు ఘట రూపంలో ఉన్న అమ్మవారిని భక్త జనం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తీన్ మార్, డప్పు డ్యాన్సుల మధ్య ఉత్సవం కనుల పండువగా జరిపారు.
సంతానం లేని దంపతులు అమ్మవారి వేషధారి ఇచ్చిన బియ్యాన్ని వండుకొని తింటే సంతానప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు బియ్యం తీసుకునేందుకు హాజరయ్యారు. మూడో రోజు తమ కోర్కెల ఫల సిద్ధికై అమ్మ వారి ప్రతిష్టా స్థానంలో పాతిపెట్టిన నాణాలను భక్తులు చేజిక్కించుకొని.. మరలా కొత్తగా నాణాలను పాతడానికి భక్తులు ఎగబడ్డారు. అమ్మవారి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తణుకు సూరిబాబు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు.
కనుల పండువగా.. సత్తెమ్మ తల్లి జాతర - ఈరోజు తణుకు వంశ ఇలవేల్పు సత్తెమ్మ తల్లి జాతర వార్తలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో తణుకు వంశ ఇలవేల్పు సత్తెమ్మ తల్లి జాతర కనుల పండువగా జరిగింది. రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
తణుకు వంశ ఇలవేల్పు సత్తెమ్మ తల్లి జాతర
ఇవీ చూడండి...