ఊయలలో గణపయ్య...ఊగుతూ దీవించయ్య - swing
తూర్పుగోదావరి జిల్లా చాకలిపాలెంలో ఉయ్యాల గణపతి కనువిందు చేస్తున్నాడు. ఉయ్యాలలో హాయిగా ఊగుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా చాకలిపాలెంకు చెందిన మొల్లేటి శ్రీనివాస్ అనే భక్తుడు తన ఆరాధ్య దైవం బొజ్జ గణపయ్యపై భక్తిని వినూత్నరీతిలో చాటుకున్నాడు. వినాయక చవితి సందర్భంగా... ఎంతో ప్రీతిపాత్రమైన దైవానికి తన ఇంటి ముందు... ఊయల ఏర్పాటు చేశాడు. ఊయలపై పెట్టి పూజలు చేస్తున్నాడు. ఊయల చుట్టూ పూలకుండీలు పెట్టి...ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించాడు. ఊగవయ్యా...హాయిగా ఓ బొజ్జగణపయ్య...అంటూ తన భక్తిని చూపిస్తున్నాడు.
ఇవీ చూడండి-అగ్గిపెట్టెల గణపయ్య... ఆకర్షణగా నిలిచేనయ్య..!