మడ అడవుల్లో వేసవి విడిది - wast godavari
మండుటెండల నుంచి ప్రజలకు ఉపసమనం కలిగించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని మడ అడవులు వేసవి విడిదిగా మారాయి. పర్యాటకులకు తగ్గట్టుగా సకల సౌకర్యాలను జిల్లా వన్యప్రాణి, అటవీ సంరక్షణ సిబ్బంది అందిస్తున్నారు.
ఫొని తుపాను ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజలు ఉపశమనం పొందేందుకు ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి వేసవి విడిదిగా మారాయి తూర్పుగోదావరి జిల్లాలోని మడ అడవులు.
256 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పచ్చని మడ అడవులు... మండు టెండల నుంచి ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. అడవిలోని రకరకాల పక్షులు, జంతువులతోపాటు గోదావరి నది పాయలు, బోటు షికారు యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రత్యేక వాహనాలపై ఇక్కడకి చేరుకుంటున్నారు.
జిల్లా వన్యప్రాణి, అటవీ సంరక్షణ సిబ్బంది పర్యాటకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.