ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజుముక్కలు.. జొన్నపొత్తులు.. కాదేదీ కళకు అనర్హం!

కుక్కపిల్ల, అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గాజుముక్కలు, జొన్నపొత్తులు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఈ విద్యార్థులు. వ్యర్థాలను కళాకండాలుగా మలుస్తూ... అందరినీ ముచ్చటగొలుపుతున్నారు.

గాజుముక్కలు.. జొన్నపొత్తులు.. కాదేదీ కళకు అనర్హం!

By

Published : Jul 27, 2019, 2:53 AM IST

Updated : Jul 27, 2019, 3:35 AM IST

గాజు ముక్కలు... జొన్న పొత్తులు... అన్నీ కళాఖండాలే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు తమ కళానైపుణ్యంతో ఆకట్టుకుంటున్నారు. చెత్తగా భావించి బయటపడేసే వస్తువులను ఆకర్షణీయమైన కళాకృతులుగా మలుస్తున్నారు.. సమగ్ర శిక్షా అభియాన్​లో భాగంగా ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమిస్తోంది. అలా సర్పవరం బడిలో 2012లో సరస్వతి చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీయడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. పిల్లలకు పనికిరాని వస్తువులతో కళాకృతులు తయారుచేయడం నేర్పిస్తున్నారు. ఐస్​క్రీమ్ పుల్లలు, పగిలిన గాజుముక్కలు, పాత వార్తాపత్రికలు, మొక్కజొన్న పొత్తు తొక్కలు ఇలా ఒకటేమిటి పనికిరావు అనే ప్రతి వస్తువును కళాఖండాలుగా మలుస్తున్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తే... వారు మేథావుల్లా తయారవుతారని ఉపాధ్యాయురాలు సరస్వతి చెబుతున్నారు. 650 మంది పిల్లలను 13 సెక్షన్లుగా విభజించి.. ప్రతి సెక్షన్​కు వారానికి 3 పీరియడ్లు క్రాఫ్ట్ తరగతి ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వారిలోని ఉత్సాహం చూసి తాను కొత్త వస్తువుల తయారీ నేర్చుకుని మరీ వారికి నేర్పిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి..కాలానుగుణ వ్యాధులతో ప్రజల అవస్థలు'

Last Updated : Jul 27, 2019, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details