తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఓ విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందాడు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం వై.రామవరం మండలం బంగారుబందలు గ్రామానికి చెందిన కోండ్లమంగిరెడ్డి మారేడుమిల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మైదానంలో ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు.
అతడిని ఉపాధ్యాయులు హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని రంపచోడవరం ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ శిరీష తెలిపారు. విద్యార్థి మృతిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.సరస్వతి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.