ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మకర్తల మండలి నియామకానికి ఉత్తర్వులు జారీ - temples

హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులు, 5 కోట్లలోపు వార్షికాదాయం ఉన్న ఆలయాల్లో ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు 20 రోజుల గడువు ఇచ్చింది.

ఉత్తర్వులు

By

Published : Sep 30, 2019, 7:35 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది, మందపల్లి, వాడపల్లి, కాకినాడ ఎం.ఎస్.ఎన్ ఛారిటీలకు ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 రోజుల్లోగా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకుదరఖాస్తు నమూనాతో సహా జీవో నెంబర్ 986 విడుదల చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులు, దేవాదాయ శాఖ చట్టం ప్రకారం రూ.1 నుంచి 5 కోట్లు వార్షిక ఆదాయం కలిగిన ఆలయాలకు ప్రస్తుతం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details