మానవహక్కుల పరిరక్షణలో ప్రతిఒక్కరూ రాజ్యాంగానికి లోబడి ఉండాలని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు హజరయ్యారు. రాజ్యాంగం కల్పించిన అనేక హక్కుల్లో.. మానవ హక్కుల పరిరక్షణ ఒకటని రవీంద్రబాబు గుర్తుచేశారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి బహుమతులు అందించారు.
'మానవ హక్కుల పరిరక్షణలో అందరూ రాజ్యాంగానికి లోబడి ఉండాలి' - LATEST UPDATES IN EAST GODAVARI
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. మానవహక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి ఉండాలని సూచించారు.
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సు