తిరుమలలో శ్రీవారికి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల పూజా కైంకర్యాలను అదే రీతిలో సామాన్య భక్తులు తిలకించి పుణ్యఫలాలు అందుకునేలా కేంద్రపాలిత యానంలో తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తితిదే దేవస్థానం ఆస్థాన పండితుల శిష్య బృందం ఆధ్వర్యంలో గత పదిహేడేళ్లుగా యానాంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పరిమిత భక్తుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించి సోమవారం ముగించారు. చివరి రోజు బాలాలయంలోని మూలవిరాట్టుకు వేద పండితులు పంచ ద్రవ్యాలు.. పండ్ల రసాలు.. పసుపు విభూధి తదితరాలతో అభిషేకాలు నిర్వహించారు..
యానంలో ముగిసిన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు - శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
యానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితుల శిష్య బృందంతో శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగాయి. 12రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి.
ముగిసిన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు