ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూగజీవులకు 'ఉడుత 'సాయం

ఇల్లు విశాలంగా ఉంటే సరిపోదు మనసు విశాలంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు....ఈ నానుడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బాగా ఒంటపట్టించుకున్నట్లుంది. తనకు సరైన గూడులేదు కానీ...ఏ జీవికి కష్టమెుచ్చినా చూస్తూ ఊరుకోడు. వాటి కష్టాలను తన కష్టాలుగా భావించి ఆ మూగజీవాలను ఇంటికి తీసుకువచ్చి  రక్షణ కల్పిస్తాడు.

మూగజీవుల పట్ల 'ఉడుత 'సాయం

By

Published : Jul 31, 2019, 12:37 AM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం రామాలయం వీధికి చెందిన పవన్ కుమార్ ఏసీ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. ఓ ఇంట్లో ఏసీకి మరమత్తులు చేస్తుండగా...ఏసీ అవుట్ బాక్స్​లో చిక్కుకొని ఓ తల్లి ఉడుత చనిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించిన పవన్ వాటిని ఇంటికి తీసుకువచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. వాటికి పాలు పట్టించి ఆలనా పాలనా చూస్తూ తమ కుంటుంబంలోని సభ్యుల వలే భావించి ప్రాణాలు కాపాడుతున్నాడు. తను ఉండటానికి సరైన గూడు లేకపోయినా...ఇంటి ఆవరణలో పక్షులను పెంచుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. మూగ జీవుల పట్ల మమకారాన్ని ప్రదర్శిస్తూ...సాటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మూగజీవుల పట్ల 'ఉడుత 'సాయం

ABOUT THE AUTHOR

...view details