తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వెలుపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సభా వేదిక నిండా జనం ఉన్నారు. సీఎం సభా వేదిక వెలుపల నాడు - నేడు పనులను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సభకు అత్యంత సమీపంలో వెలుపల జనరేటర్ సంబంధించి కేబుల్ వైర్లు నుంచి మంటలు ఏర్పడ్డాయి.
CM JAGAN: సీఎం సభలో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంట - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు చేసిన ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వెలుపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
దీంతో అగ్నిమాపక సిబ్బంది ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. సభలో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించి విద్యుత్ పునరుద్దరించారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ కే.సంతోష్ రావు సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన జనరేటర్‌కు సంబంధించినదని, దీనిపై విచారణ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ramya murder case: రణరంగంగా మారిన గుంటూరు... పరామర్శకు వెళ్లిన తెదేపా నేతలు అరెస్టు