కన్నుల పండుగగా షిరిడీ సాయిబాబా వార్షికోత్సవం
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని దేవాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ వార్షిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గౌతమి గోదావరి తీరాన వెలసిన బాబాను టన్నున్నర పుష్పాలతో సుందరంగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 108 మంది యువతులతో గౌతమి గోదావరి నుంచి తీసుకొచ్చిన జలాలతో గ్రామోత్సవం జరిపారు. గోదావరి జలాలతో పాటు 40 రకాల పండ్ల రసాలతో బాబాకు అభిషేకం చేశారు. జిల్లా నలుమూలల నుంచి బాబాను భక్తులు దర్శించుకున్నారు. సుమారు 10 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యలు నిర్వహించారు.