తెలంగాణాలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ ఇసుక శిల్పాన్ని రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు రూపొందించారు. ఈ అకృత్యాలకు అంతంలేదా ? ఆడపిల్లగా పుట్టడమే పాపమా? అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా తీర్చారు. పసలేని శిక్షలే ఆడవారికి శాపాలుగా మారాయి అని చాటి చెప్తున్నట్టుగా మహిళను వేధిస్తున్న ఒక మానవ మృగాన్ని ప్రదర్శిస్తూ సైకత కళాఖండాన్ని రూపొందించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు, అకృత్యాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు నిర్మించిన ఈ సైకత శిల్పం అందరినీ ఆలోచింపచేస్తోంది.
sand art on women harassment: పుట్టడమే పాపమా..?? - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తెలంగాణాలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు ఈ కళాఖండాన్ని రూపొందించారు.
పుట్టడమే పాపమా..??