దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం సులభతరమైన ఏర్పాటు చేసింది. ఇంత వరకూ దివ్యాంగులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాలకి వెళ్లి వైకల్య ధ్రువీకరణ పత్రాలు తీసుకునేవారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ... రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రులకు దివ్యాంగులు రాకుండా గ్రామాల్లో వారికి దగ్గరగా ఉండే సామాజిక ఆసుపత్రిలో వీటిని ఇచ్చే విధంగా శిబిరాలను నిర్వహించారు. పి.గన్నవరంలో గల సామాజిక ఆసుపత్రికి.... కంటి ఎముకలు విభాగాలకు చెందిన వైద్యులు ఆ విభాగాలకు చెందిన దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం వారి వైకల్యం శాతాన్ని బట్టి ధ్రువపత్రాలు ఆన్లైన్లో తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని వైద్యులు తెలిపారు.
దివ్యాంగులకు సులభంగా వైకల్య నిర్థరణ ధ్రువపత్రాలు - sadharan sibhiram news in p gannavaram
దివ్యాంగులకు వైకల్యం నిర్ధరణ ధ్రువపత్రాలు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. వైకల్య ధ్రువీకరణ పత్రాలు తీసుకునేవారికి... గ్రామాల్లో ఉండే సామాజిక ఆసుపత్రిలోనే ధ్రువపత్రాలు అందించే విధంగా శిబిరాలను ఏర్పాటు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో సదరం శిబిరం సులభతరం