లాక్డౌన్ సడలింపులతో రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ... ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కొొట్టుమిట్టాడుతోంది. లాక్డౌన్ ముందు వరకు లాభాల్లో ఉన్న కోనసీమ ఆర్టీసీ.... ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. అమలాపురం , రావులపాలెం , రాజోలు డిపోల నుంచి రోజుకు 267 బస్సులు తిరిగేవి... కానీ ఇప్పుడు 60 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.
132 బస్సులు నడిచే అమలాపురం డిపో నుంచి కేవలం 32 బస్సులు మాత్రమే ప్రయాణిస్తున్నాయని డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. ఈ డిపోలో నెలకు రూ.3.50 కోట్ల నష్టం వస్తోందని వెల్లడించారు. రోజుకు 15 వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేసేవారని.. ఇపుడు 1500 మంది ప్రయాణికులు కూడా రావడంలేదని తెలిపారు. పాలెం, రాజోలు డిపోల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు.