ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలావస్థలో తీగల వంతెన... నడవాలంటే భయం..భయం - తూర్పు గోదావరి న్యూస్

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిపాయపై పాత కోరంగి, కొత్త కోరంగి మధ్య ఉన్న రోప్​వే వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు మరమ్మతులు లేక ఇనుపరాడ్లు, దారి రేకులు పాడైపోయాయి. ఈ వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Ropeway bridge damaged in east godavari
శిథిలావస్థలో పాత కోరంగి రోప్ వే బ్రిడ్జ్

By

Published : Dec 29, 2019, 7:32 AM IST

శిథిలావస్థలో పాత కోరంగి రోప్ వే బ్రిడ్జ్
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పాత కోరంగి - కొత్త కోరంగితో పాటు మరో 5 గ్రామాలను కలుపుతూ ఓ రోప్​వే వంతెన ఉంది. లోక్​సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి బాలయోగి చొరవతో 1999లో గోదావరి నదిపాయపై ఇనుప తీగల వంతెన నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. పదేళ్ల క్రితం.. వంతెనకు జిల్లా పరిషత్ నిధులతో ఒకసారి తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత పదేళ్ల నుంచి ఎటువంటి నిర్వహణకు నోచుకోక ప్రధాన తీగకు అనుసంధానంగా ఉండే ఇనుప రాడ్లు వదులైపోయాయి. వాహనాలు వెళ్లే దారిలో ఉండే రేకులు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల వారు నిత్యం రాకపోకలు సాగించే మార్గం కావటం వలన..ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వంతెన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details