కాకినాడ నగరంలో డ్రైనేజి పూడికతీత పనులకు రోబో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆటోమేషన్ రోబోను మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. సుమారు రూ.36 లక్షలు విలువైన రోబోను నగరపాలక సంస్థకు ఓఎన్జీసీ సంస్థ అందించింది.
'రోబో సేవల ద్వారా కాకినాడను మరింత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం'
కాకినాడలో డ్రైనేజి పూడికతీత పనుల కోసం రోబో సేవలను మంత్రి కన్నబాబు అందుబాటులోకి తెచ్చారు. ఈ రోబో ద్వారా నగరాన్ని మరింత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి కన్నబాబు
మ్యాన్ హోల్స్ చెత్త, పూడికను తొలగించేందుకు ఈ రోబో ఉపయోగపడుతుంది. రోబో సేవల ద్వారా నగరాన్ని మరింత స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దవచ్చని మంత్రి కన్నబాబు చెప్పారు. జీవన ప్రమాణాల స్థాయిలో కాకినాడ జాతీయ స్థాయిలో నాల్గొవ ర్యాంక్, ప్రణాళికబద్ధ నగరాల్లో దేశంలో మొదటి స్థానం రావడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లడించారు.
ఇదీచదవండి.
'వైయస్ఆర్ వల్లే.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతోంది'
Last Updated : Mar 28, 2021, 10:30 PM IST