తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి జొన్నాడ సెంటర్ నుంచి తాళ్ళరేవు మండలం అరటికాయ లంక కేంద్రపాలిత యానం వరకు ఉన్న గౌతమి గోదావరి నది తీరం వెంబడి ఉన్న రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు ఐదేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు విస్తరణకు 190 కోట్లు కేటాయించి సర్వే పనులు పూర్తి చేయించారు. ప్రారంభించేందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు గాని ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తీరం వెంబడి ఉన్న సుమారు 18 లంక గ్రామాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల లంక గ్రామాల్లో పండే అరటి, కొబ్బరి... ఇతర వాణిజ్యపరమైన ఉత్పత్తులు తొందరగా మార్కెట్ చేరేందుకు అవకాశం ఉంది. కాకినాడ- అమలాపురం జాతీయ రహదారి 216 అనుసంధానంగా ఉండటం... యానం నుంచి రాజమహేంద్రవరం ప్రయాణించేవారికి 20 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. సమయం ఆదా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
రహదారి విస్తరణ పనులు జరిగేదెన్నటికో..
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి పనులు ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.
రహదారి