తూర్పు గోదావరి జిల్లా తునిలోని తేటగుంట వద్ద జరిగిన ప్రమాదంలో... ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కుమారపురానికి చెందిన రెడ్డి... భార్య, కుమార్తెతో కలిసి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు.
ప్రమాదవశాత్తు వీరి ముందు వెళ్తున్న వ్యాన్ను వెనకనుంచి ఢీకొనగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య, కూతురికి గాయాలయ్యాయి. వీరిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.