ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​.. పరేషాన్​.. లబ్ధిదారులకు పూర్తిగా అందని సరుకులు

తూర్పు గోదావరి జిల్లా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్​ పంపిణీలో గందరగోళం నెలకొంది. బియ్యం, కందిపప్పు డిమాండ్​కు తగినంతగా సరఫరా లేకపోవడం వల్ల కార్డుదారులకు పూర్తి స్థాయిలో సరకులు అందలేదు. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

By

Published : Apr 14, 2020, 3:41 PM IST

రేషన్​.. పరేషాన్​.. లబ్ధిదారులకు పూర్తిగా అందని సరుకులు
రేషన్​.. పరేషాన్​.. లబ్ధిదారులకు పూర్తిగా అందని సరుకులు

తూర్పు గోదావరి జిల్లాలో చౌక దుకాణాల ద్వారా ఉచిత రేషన్‌ సరకుల పంపిణీ ప్రహసనంగా మారింది. చౌక దుకాణాలకు నూరు శాతం బియ్యం సరఫరా కాకపోవడం, కందిపప్పు అవసరం మేరకు అందుబాటులో లేకపోవడం, సరకుల పంపిణీ గడువు ముగియకుండానే 11వ తేదీ నుంచి ఈ-పోస్‌ యంత్రాల్లో కార్యకలాపాలు నిలిపివేయడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 29వ తేదీ నుంచి జిల్లాలోని 2,600 చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీని ప్రారంభించారు. బియ్యం పొందిన వారందరికీ కందిపప్పు పంపిణీ చేయలేదు. కందిపప్పు చౌక దుకాణాలకు చేరేసరికి ఈ - పోస్‌ యంత్రాలు మనుగడలో లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి.

కందిపప్పు పంపిణీ లేదు

జిల్లాలో 1.60 లక్షల రేషన్‌ కార్డులకు కందిపప్పు పంపిణీ చేయలేదు. జిల్లా యంత్రాంగం సమస్యను పౌరసరఫరాల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ-పోస్‌ యంత్రాలను మనుగడలోకి తీసుకొచ్చారు. 956 చౌక దుకాణాలకు సంబంధించిన యంత్రాలను మాత్రమే సరుకుల పంపిణీకి అనుమతించారు. ఆయా చోట్ల మంగళవారం సాయంత్రంలోగా కందిపప్పు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డులకు అందించే బియ్యం పంపిణీపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు.

ఇదీ చూడండి:

వలస కార్మికులకు వాహనం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details