తమకు పెన్షన్ రావడం లేదని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామ సచివాలయం ఎదుట పెన్షన్ దారులు నిరసన తెలిపారు. కొన్నేళ్లుగా తమకు పింఛను వస్తున్నా.. ఇప్పుడు ఎందుకు రావడం లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరసన తెలియజేశారు. రిజెక్ట్ అయిన పెన్షన్లను రీ వెరిఫికేషన్ చేసి అర్హులకు వచ్చే విధంగా కృషి చేస్తామని రాజవోలు పంచాయతీ కార్యదర్శి చెప్పారు.
'మాకు పింఛను రావడం లేదు..పట్టించుకోండి' - రాజవోలులో పెన్షన్ దారుల నిరసన న్యూస్
తమకు పింఛను రావడం లేదని.. పెన్షన్‌దారులు ఆందోళన వక్తం చేశారు. ఎప్పటినుంచో వస్తున్న పింఛన్ ఇప్పుడెందుకు రావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'మాకు పింఛను రావడం లేదు..పట్టించుకోండి'