వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... సీఎం జగన్ ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారని మాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ముఖ్యమంత్రి ధోరణినే తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అనురిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల విషయంలోనూ.. స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని, పనికిరాని స్థలాలను కేటాయించాలని చూస్తున్నారని విమర్శించారు.
'పేదల ఇళ్ల స్థలాల్లో వైకాపా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు' - chinarajappa comments on land for houses
ప్రతిపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలనే వైకాపా ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని... మాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ఇళ్ల స్థలాల విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పనికి రాని భూములను కేటాయించాలని చూస్తున్నారని విమర్శించారు.
మాజీమంత్రి చినరాజప్ప