ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 28, 2020, 10:19 PM IST

ETV Bharat / state

'నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు'

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన విద్యాలయాలను ఆమె సందర్శించారు.

rajamahendravaram sub collector said Facilities in public schools have improved with nadu-nedu scheme
ఆదర్శ పాఠశాలను పరిశీలిస్తున్న రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుమప అంజలి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా ఎంపికైన ఆలమూరు మండలం మడికి ఉన్నత పాఠశాల, చెముడు లంక ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. మడికి పాఠశాలలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, డిజిటల్ తరగతి గదులు, ఆట స్థలాన్ని చశారు. అధికారులను అభినందించారు.

ఇదీ చదవండి:

విద్యార్థుల మృతిపై గవర్నర్ సంతాపం

ABOUT THE AUTHOR

...view details