ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్యాణం.. కమనీయం.. పుష్ప యాగం - annavaram pushpa yagam

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా ఉత్సవాల చివరి రోజు శ్రీ పుష్పయాగం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ప్రతిమలను సుందరంగా అలంకరించిన అర్చకులు పూజలు నిర్వహించారు.

pushpayagam in ananavaram
అన్నవరంలో పుష్పయాగం

By

Published : May 9, 2020, 11:58 AM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజు శ్రీ పుష్పయాగం వేడుకగా పూర్తయింది. సుగంధ పరిమళాల నడుమ స్వామివారు ఊయలలో శేషపాన్పుపై సేదదీరగా.. అమ్మవారు స్వామివారికి పాదసేవ చేస్తున్నట్టు చేసిన అలంకరణ అద్భుతంగా ఉంది.

ఈ క్రమంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల శ్రీపుష్పయాగం కమనీయంగా జరిగింది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రూపంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లను అలంకరించి పుష్పాలతో పూజలు చేశారు. ఊయల ఊపారు. మహిళలకు తాంబూలాలు, రవికలు అందించారు. ఈవో త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. భక్తులను అనుమతించలేదు.

ABOUT THE AUTHOR

...view details