ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీపోయిన ఇంట్లో కట్టల సంచులు - east godavari

పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్న ఓ బ్రహ్మణుడు మృతిచెందాడు. ఎవరూ లేని ఆ ఇంట్లో భారీగా నగదు బయట పడింది.

నగదు లభ్యం

By

Published : Aug 29, 2019, 7:36 AM IST

కూలిన ఇంట్లో భారీగా నగదు లభ్యం

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ పాత ఇంట్లో నివాసముంటున్న బ్రహ్మణుడు మృతిచెందాడు. సుమారు మూడ్రోజుల క్రితం ఇతను మృతి చెందగా ఎవరు గమనించలేదు. దుర్వాసన వస్తుండటంతో గమనించి స్థానికులు కుమారుడుకి సమాచారం ఇచ్చారు. దహన సంస్కారాలు చేశారు. కూలిపోయి ఉన్న ఇంటి లోపల మట్టిలో సంచుల్లో చిల్లర, భారీగా నగదు ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. సంచుల మూటల్లో నగదు ఉండటంతో లెక్కించారు. మిషన్ తో మధ్యాన్నం నుంచి రాత్రి వరకు లెక్కించినా పూర్తికాలేదు. లక్షల్లో నగదు వుంటుందని అంచనా వేస్తున్నారు. తుని పట్టణంలో ముక్తిలింగయ్యగారి వీధి లో ఓ పాడుబడ్డ ఇంట్లో ఎన్నో ఏళ్ళు గా సుబ్రహ్మణ్యం అనే బ్రాహ్మణుడు నివాసముంటున్నాడు. పలు కారణాలతో కుమారుడు, భార్య వేరే ప్రాంతంలో వుంటుండటంతో ఇతను ఒంటరిగా ఉంటూ దానాలు తీసుకుంటూ, భిక్షాటన చేస్తూ కూలిపోయిన ఇంట్లో 30 ఏళ్లుగా ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details