ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో కరోనా పరిస్థితులపై పుదుచ్చేరి మంత్రి సమీక్ష

ఇప్పటివరకు యానాంలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయితే ఏపీ ప్రభుత్వం లాక్​డౌన్ నిబంధనలను కొన్ని సడలించటంటో యానాం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి సమీప ప్రాంతాల్లో తాజాగా కేసులు నమోదు కావడంపై భయపడుతున్నారు. ఈ విషయంపై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

pudicheri health
pudicheri health

By

Published : May 15, 2020, 4:57 PM IST

మార్చి 22వ తేదీ నుంచి నేటి వరకు యానాం అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ఇంతవరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచడం ద్వారా ఇది సాధ్యమైంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలోకి ఇతరుల రాకపోకలు ఎక్కువ కావడం, సమీప గ్రామాల్లో కరీనా పాజిటివ్ కేసులు బయట పడటం, యానాం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయమై పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలం చేరుకున్న వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. క్వారంటైన్ లో ఉన్న విద్యార్థుల స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను ఆయన పరిశీలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details