భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పెరిగిపోయాయని... ఈ తరుణంలో కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేయడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తాటిపాక మధు పేర్కొన్నారు. బోర్డు ఎత్తవేతకు నిరసనగా ఈ నెల 17న మంత్రి కురసాల కన్నబాబు ఇంటి ముట్టడికి కార్మికులు పెద్దఎత్తున తరలి రావాలన్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సాంబమూర్తి నగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి... చేతి వృత్తులు, ఇతర వర్గాల వారికి అనేక రుణాలు సాయం చేస్తున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఇప్పటికీ కరవు భత్యం రూ.10 వేలు ఇవ్వలేదని మధు అన్నారు. ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నివర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు.