లాక్డౌన్తో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కపూట అన్నం కోసం అలమటిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు కారణంగా ఆహార పంపిణీకి దాతలు ముందుకు రావటం లేదు. దీనివల్ల చాలా మంది పేదలు కొళాయి నీటితోనే కడుపు నింపుకుంటున్నారు. ఒకరో ఇద్దరో దాతలు పంచే ఆహారం కోసం పేదలు పరుగులు పెడుతున్నారు. ముందు వెళ్లిన వారికి భోజనం దొరుకుతుంటే... మిగిలిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
గోదావరి తీరంలో... ఆకలి రాజ్యం! - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు, అనాధలు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. అన్నం పొట్లం తెచ్చే వాహనం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరైనా ఆహారాన్ని పంచేందుకు వస్తే అన్నార్థులు పరుగులు పెడుతున్నారు. ముందు వెళ్లిన వారికే భోజనం దొరుకుతోంది. మిగిలిన వారి ఆపూట పస్తులుండాల్సిందే. ఆతిథ్యానికి మారుపేరుగా నిలిచే గోదావరి తీరంలోనూ ఆకలి దప్పులతో అలమటిస్తున్నవారు ఎందరో దర్శనమిస్తున్నారు.
poor people suffering for food in rajamahendravaram